పాపరాజీస్ ఆమెను ఫొటోస్ తీస్తూ కృతి ఇటు చూడండి అని పిలిచారు..దీనికి కీర్తి నవ్వుతూ ..నా పేరు కీర్తి అంటూ సమాధానమిచ్చింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : కీర్తి సురేష్ ఇప్పుడు నార్త్ లో తన హవా చాటడానికి రెడీ అవుతుంది. బేబీ జాన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా తిరుగుతుంది. అయితే కీర్తి సురేష్ కు నార్త్ లో ఘోర అవమానం జరిగింది. అక్కడి సినిమా రిపోర్టర్లు ఆమె ఎక్కడికెళ్తే అక్కడ వెంటపడుతున్నారు. పాపరాజీస్ ఆమెను ఫొటోస్ తీస్తూ కృతి ఇటు చూడండి అని పిలిచారు..దీనికి కీర్తి నవ్వుతూ ..నా పేరు కీర్తి అంటూ సమాధానమిచ్చింది. ఇంతలో మరొకరు ‘కీర్తి దోశ’అంటూ పిలవడంతో ‘కీర్తి దోశ కాదు.. కీర్తి సురేశ్. దోశ నాకు ఇష్టమైంది’ అని నవ్వుతూ చెపారు.కాని సౌత్ ఇండియన్ ను ఇడ్లి సాంబార్ ...లేదా దోశ ఇలా నిక్ నేమ్స్ తో పిలవడం చాలా చోట్ల వింటూ ఉంటాం. ఇలా మినిమమ్ తెలీకుండా ఇలా దోశ అని పిలవడం సౌత్ హీరోయిన్ కు అవమానించడమే.
ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు అంటోని తట్టిల్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్న మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ తాజాగా ముంబైలో మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నది. పెళ్లై వారం రోజులు కూడా గడువక ముందే కీర్తి సురేశ్ తన బాలీవుడ్ ప్రాజెక్టు అయిన బేబీ జాన్ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది.