Akhil Akkineni: సంగీత్ లో నాటు నాటు పాటకు స్టెప్పులేసిన అఖిల్ !

'ఏజెంట్' మూవీ త‌ర్వాత బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్ర‌స్తుతం ముర‌ళీ కిశోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఓ చిత్రంలో న‌టిస్తున్నారు


Published Feb 23, 2025 10:01:00 PM
postImages/2025-02-23/1740328551_akhilakkineni.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దుబాయ్ లో జరిగిన సన్నిహితుల పెళ్లి లో  అక్కినేని అఖిల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన " ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతుంది. ఇదే వేడుక‌లో తార‌క్‌, ఆయ‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, రామ్‌చ‌ర‌ణ్ అర్ధాంగి ఉపాస‌న‌, అమ‌ల‌, న‌మ్ర‌తా శిరోద్క‌ర్, సితార త‌దిత‌రులు కూడా సంద‌డి చేశారు. కాగా, 'ఏజెంట్' మూవీ త‌ర్వాత బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్ర‌స్తుతం ముర‌ళీ కిశోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అఖిల్ మరింత జోష్ తో ఉన్నాడంటున్నారు నెటిజన్లు.

 

Related Articles