సోషల్ మీడియా లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తారకరత్న గురించి తన పిల్లల గురించి పోస్టులు చేస్తుంది.ఈ రోజు తారకరత్న రెండవ వర్ధంతి .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యి చికిత్స తీసుకుంటూ 2023 ఫిబ్రవరి 18 న మరణించిన సంగతి తెలిసిందే . నందమూరి కుటుంబానికి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి అప్పట్నుంచి సోషల్ మీడియా లో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తారకరత్న గురించి తన పిల్లల గురించి పోస్టులు చేస్తుంది.ఈ రోజు తారకరత్న రెండవ వర్ధంతి . దీంతో తన భార్య తారకరత్న ను తలుచుకొని ఓ ట్వీట్ వేశారు.
తారకరత్న , పిల్లలతో ఉన్న పిక్స్ ను షేర్ చేసి నిన్ను విధి దూరం చేసింది. నీ లోటు ఎవ్వరు పూరించలేరు. నిన్ను కోల్పోయిన బాధను కాలం మానిపోనివ్వదు. నీ స్థానాన్ని మరేదీ పూరించలేదు. విడిపోతామనుకోలేదు...ఇలా విడిపోతామని అసలు అనుకోలేదు. మా జీవితాల్లో నువ్వు లేవన్నది నిజం ...కాని నీ ఉనికి మా జీవితాల్లో లేదన్నది అబధ్దం. ఐ లవ్ యూ ..అంటూ ట్వీట్ చేశారు.
అలేఖ్య రెడ్డికి ...నిష్క అనే కూతురుతో పాటు తనయ్ రామ్, రేయా అనే ఓ పాప, బాబు కవలపిల్లలు ఉన్నారు. ఇక అలేఖ్య రెడ్డి వైసీపీ మాజీ నేత విజయ సాయి రెడ్డికి బంధువులు అని కూడా అందరికి తెలుసు. రెగ్యులర్ గా వాళ్ళతో కూడా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అలేఖ్య.