సమంత సినిమాల్లో కాని సీరిస్ లో కాని కనిపించలేదు. అయితే రీసెంట్ గా తన ఎప్పుడో చేసిన సిటాడెల్ రిలీజ్ అయ్యింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సమంత తన హెల్త్ కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే . చాలా యూట్యూబ్ లో హెల్త్ వీడియోలు , తన బిజినెస్ లతో బిజీ గానే ఉంది. సమంత చివరగా ఖుషి సినిమా చేసింది. తర్వాత సమంత సినిమాల్లో కాని సీరిస్ లో కాని కనిపించలేదు. అయితే రీసెంట్ గా తన ఎప్పుడో చేసిన సిటాడెల్ రిలీజ్ అయ్యింది.
ప్రస్తుతం సమంత చేతిలో మా ఇంటి బంగారం అనే ఒక సినిమా ఉంది. అది కూడా సమంత సొంత ప్రొడక్షన్ . తనకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఇచ్చి బాలీవుడ్ లో పరిచయం చేసిన రాజ్ &డీకేలు తెరకెక్కిస్తున్న మరో సిరీస్ కి ఓకే చెప్పింది. నెట్ ఫ్లిక్స్ , డి2 ఆర్ సంయుక్త నిర్మాణంలో ఆదిత్యరాయ్ కపూర్ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో హారర్ ఫాంటసీ వెబ్ సీరిస్ రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్ డమ్ ని ప్రకటించారు.
ఈ సిరీస్ షూటింగ్ 25 రోజులు జరిగింది. తర్వాత సీరిస్ ఆగిపోయింది. నెట్ ఫ్లిక్స్ ఈ సీరిస్ కు భారీ బడ్జెట్ అందించినా 25 రోజుల షూటింగ్ కే సగం డబ్బు ఖాళీ అవ్వడంతో మిగిలిన బ్యాలెన్స్ సినిమాకు సరిపోదని ఆపేశారట. ఇంకా చాలా రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. సీరిస్ కు పనిచేస్తున్న ఓ వ్యక్తి డబ్బు దొంగిలించి పారిపోయాడని బాలీవుడ్ టాక్.
అలాగే ఈ సిరీస్ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే, రైటర్ సీతా ఆర్ మేనన్ మాటిమాటికి స్క్రీన్ ప్లే కూడా మారుస్తుండటంతో ఖర్చు పెరుగుతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలేవీ లేవు. ఉన్న ఒక్క సినిమా తన నిర్మాణ సంస్థలోదే. నిర్మాత, దర్శకుడు రాజ్ తో సమంత ప్రేమలో ఉన్నట్టు, డేటింగ్ చేస్తున్నట్టు ఇటీవల రెగ్యులర్ గా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చెన్నై పికెల్ బాల్ టీమ్ కూడా కొనుగోలు చేసారు.