న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తిరుపతిలో పోలీసులతో మంచు మనోజ్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా మనోజ్ గత కొద్ది రోజుల నుంచి తండ్రి మోహన్ బాబు , సోదరుడు మంచువిష్ణుతో కుటుంబపరమైన ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత రెండు నెలలుగా టీవీ సీరియల్ గా సాగుతున్న ఈ కలహాలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి.
మోహన్ బాబు యూనివర్సిటీకి గతంలో తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది.సంక్రాంతి టైంలో తన తాతయ్య , నానమ్మ సమాధులకు మొక్కుకోవడానికి వెళ్లినా గొడవచేస్తున్నారని మీడియాకు తెలిపారు మనోజ్. తాజాగా మంచు మనోజ్ పోలీసులతో గొడవ పడ్డారు. ఆ సమయంలో గెస్ట్ హౌస్ లో ఉన్నారు. తాను రీసార్ట్ లో ఉంటే ఎందుకు సైరన్ కొడుతున్నారని.. తనను అరెస్ట్ చేయడానికే వచ్చారు కదా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ప్రైవసీని ఎందుకు ఎందుకు డిస్ట్రబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసుల వెంటే బాకారావు పేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి హల్ చల్ సృష్టించారు.