చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో తన పై నమోదైన కేసును కొట్టి వెయ్యాలని బన్నీ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ వేశారు. బన్నీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సినీ నటుడు అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది . చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో తన పై నమోదైన కేసును కొట్టి వెయ్యాలని బన్నీ హైకోర్టు లో క్వాష్ పిటిషన్ వేశారు. బన్నీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
అల్లు అర్జున్ ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నాం 1.30కి అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరు పరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. క్వాష్ పిటిషన్ పై విచారణ అత్యవసరం కాదని , సోమవారం వినాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. క్వాష్ పిటిషన్ లో అల్లు అర్జున్ బెయిల్ కోసం ప్రస్తావించారు. ఈ పిటిషన్ ద్వారానే మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.