Daaku Maharaaj : బాలకృష్ణ మూవీ " డాకు మహారాజ్ " సింగిల్ ప్రొమో !

ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టీం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.


Published Dec 13, 2024 12:10:00 PM
postImages/2024-12-13/1734072059_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ‘డాకు మ‌హారాజ్‌’. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రద్దా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్ లు క‌థానాయిక‌లుగా న‌టిస్తుండగా బాబీ డియోల్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టీం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.


ఈ చిత్రంలోని పాట‌ల‌ను వ‌రుస‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ క్ర‌మంలో మొద‌టి పాట ప్రొమోను విడుద‌ల చేశారు. “డేగ డేగ డేగ‌.. దేకో దేకో బేగా.. గుర్రం పైన సింహం చేసే..” అంటూ ఈ పాట సాగుతోంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే సినిమా మంచి బజ్ క్రియేట్ అవుతుందనేది మూవీ టీం ఓపీనియన్.


అనంత్ శ్రీరామ్ ఈ పాట‌ను రాయ‌గా న‌కాశ్ అజీజ్ పాడారు. త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ఇక పూర్తి పాట‌ను శ‌నివారం విడుద‌ల చేయ‌నున్నారు.  ఈ సినిమా లో చాందినీ చౌదరి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ ,ఫార్చుూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ , సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna nandamuri-family maharaja

Related Articles