టీజర్‌లో వెన్నెల కిశోర్, గౌతమ్‌ల కామెడీ అదిరిపోయింది. బ్రహ్మానందం ఎంట్రీతో పాటు ఆయన సీన్స్ చాలా బాగున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హాస్య బ్రహ్మా..గాడ్ ఆఫ్ మీమ్స్ బ్రహ్మానందం తన కొడుకు రాజాగౌతమ్ ...తాత మనవడిగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాఆనందం ఈ మూవీలో ఫుల్ టు ఫుల్ కామెడీ తో నడుస్తుంది. వెన్నెల కిషోర్ , బ్రహ్మానందం , ఈ మూవీలో కీ రోల్ లో కనిపించనున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక నిమిషం 53 సెకన్ల రన్ టైంతో ఉన్న ఈ టీజర్ చాలా ఆకట్టుకుంటుంది.
టీజర్‌లో వెన్నెల కిశోర్, గౌతమ్‌ల కామెడీ అదిరిపోయింది. బ్రహ్మానందం ఎంట్రీతో పాటు ఆయన సీన్స్ చాలా బాగున్నాయి. చిన్న ఎమోషనల్ సీన్స్ తో కూడిన డైలాగ్స్ ఉన్నాయి. దీంతో ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో సినిమా ప్రమోషన్స్ ను కూడా మూవీ టీం చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు.