ఈ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్ నిర్వాహణకు ఏ ఇబ్బంది వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వమే ఆదుకుందని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: విశాఖ ఉక్కుకు కేంద్రం సాయం ఓ చారిత్రక ఘట్టమని తెలిపారు సీఎం చంద్రబాబు . విశాఖ ఉక్కుకు కేంద్రం ప్రకటించిన సాయంపై మంగళగిరి లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్ నిర్వాహణకు ఏ ఇబ్బంది వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వమే ఆదుకుందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని.. ఈ విషయంలో పట్టుదలతో పనిచేశామన్నారు. ఏడు నెలలుగా చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయని తెలిపారు చంద్రబాబు. ఎలాగైతే స్టీల్ ప్లాంట్ ను కాపాడగలిగామని అభివృధ్ది బాటలో నడిపించి మంచి పేరు తీసుకురావాలని కార్మికులను కోరారు.
ఉక్కు కర్మాగారానికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర మంత్రి కుమారస్వామి లకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల హృదయాలతో విశాఖ ఉక్కుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు చంద్రబాబు . ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం వస్తుందని తెలిపారు.