ఇలాంటి టైంలో మంచు విష్ణు ఓ పోస్ట్ చేశారు. ఆయన నటించిన రౌడీ సినిమాలో ఓ డైలాగ్ ను పోస్ట్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మంచు ఫ్యామిలీ లో గొడవలు గాలివాన కాస్త ..తుఫాన్ లా మారింది. విష్ణు వర్సెస్ మంచు మనోజ్ వార్ పీక్ లో ఉంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వెళ్లడంతో మరోసారి వివాదం రాజుకుంది. సెక్యూరిటీ లోపలికి వెళ్లకుండా మనోజ్ ను ఆపేసింది. అభిమానులు చేసిన రచ్చ కు పోలీసులు లాఠీ ఛార్జీ చేసి మరీ చెదరగొట్టారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి టైంలో మంచు విష్ణు ఓ పోస్ట్ చేశారు. ఆయన నటించిన రౌడీ సినిమాలో ఓ డైలాగ్ ను పోస్ట్ చేశారు.
” సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి.. అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ” ఈ డైలాగ్ క్లియర్ గా మనోజ్ ను అన్నాడంటున్నారు నెటిజన్లు. అసలే గొడవలు ..అందులో ఇలా అనవసరమైన డైలాగులు వెయ్యడం రెచ్చగొట్టడమే అంటున్నారు నెటిజన్లు.
అయితే ఈ డైలాగుని ఉద్దేశించి మంచు మనోజ్ తాజాగా ఓ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు లాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావు” అంటూ విష్ణు కి కౌంటర్ ఇచ్చే విధంగా ట్వీట్ చేశారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.