నిందితుడు దాడి చేసే ముందు సైఫ్ ని కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు ఒప్పుకోకపోవడంతో దుండగుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ దాడి జరిగిన ఘటన పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం గా చేశారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో నిందితుడిని ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమారాల్లో నిందితుడి పిక్స్ ను పోలీసులు షేర్ చేశారు. అయితే దొంగతనం కోసమే నిందితుడు ఇంట్లోకి చొరబడ్డాడని తెలిపారు. అంతేకాదు ఫైర్ ఎగ్జిట్ డోర్ గుండా ఇంట్లోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు దాడి చేసే ముందు సైఫ్ ని కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు ఒప్పుకోకపోవడంతో దుండగుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
అయితే ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు ఆరు చోట్ల కత్తితో పొడిచాడు. అయితే ఇప్పుడు అతని ఆరోగ్యం స్థిమితంగా ఉన్నట్లు ఖాన్ కుటుంబం అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. పోలీసులు నిందితుడిని మరింత విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు.