COURT: కలర్స్ సెంటర్స్ పై సీరియస్ అయిన కోర్టు !


Published Jan 17, 2025 09:59:00 PM
postImages/2025-01-17/1737131442_kolorshealthcareindiapvtltdmiyapurhyderabadskincareclinicstza12y7xud.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వెయిట్ లాస్ జర్నీ అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్ . మా పొడి తగ్గండి సన్నగా అవుతారు. మా టీ తాగండి తేలికగా గవ్వ లా అయిపోతారు. ఈ మాటలు నమ్మి పిచ్చి జనాలు అలానే వాటి వెంటపడుతున్నారు. అయితే బరువు తగ్గడం అనేది లాంగ్ టైం ప్రాసెస్ . వారాల్లోనో ..నెలకో అయ్యే పని కాదు . నెలలు కష్టపడాలి. ఆరోగ్యంగా తగ్గాలి. ఈ సెంటర్స్ లో చెప్పినట్లు ...కడుపు పూర్తిగా మాడ్చుకొని మీరు తగ్గితే ...తిరిగి తినగానే మీ వెయిట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇలా మాయ మాటలు చెప్పిన కలర్స్ సెంటర్స్ పై కోర్టు సీరియస్ అయ్యింది. 


సంగారెడ్డికి చెందిన యువతి మియాపూర్‌లోని కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో బరువు తగ్గడానికి చికిత్స తీసుకుంది. దాదాపు రూ.1.05 లక్షలు చెల్లించిన యువతికి చికిత్స తీరు నచ్చకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కలర్స్‌ హెల్త్‌ కేర్‌ ప్రతినిధులను కోరింది.దీనికి కలర్స్ సెంటర్ వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణను చేపట్టిన జిల్లా వినియోగదారుల కమిషన్‌ యువతికి 9 శాతం వడ్డీతో డబ్బులు తిరిగి చెల్లించాలని, మానసికంగా ఇబ్బంది కలిగించినందుకు రూ.50 వేలు జరిమానా విధించింది. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే అదనంగా మరో 3 శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.


చికిత్స తీసుకున్న యువతి తగిన సూచనలు పాటించలేదని, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల బరువు తగ్గలేదని చెప్పారు. కాని బాధిత యువతి మాత్రం సమాధానం ఇస్తూ అర్హత లేని వాళ్లతో కలర్స్‌ హెల్త్‌కేర్‌ వాళ్లు చికిత్స చేయిస్తున్నారని కమిషన్‌కు తెలిపింది. నిపుణులైన వైద్యులు, సరైన అనుమతి పత్రాలు లేకుండా ఊబకాయం లాంటి కఠినమైన చికిత్సలను ఎలా అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu court weight-loss treatment

Related Articles