VIRAL : గజరాజుతో గేమ్స్ ఏంటి రా ..!

కొన్ని సార్లు ఏనుగులు చాలా భయంకరంగా రియాక్ట్ అవుతాయంటూ ప్రవీణ్ కస్వీన్ ఈ వీడియోను షేర్ చేశారు.


Published Jan 17, 2025 09:26:00 PM
postImages/2025-01-17/1737129529_ele17367543154381736754324468.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కొంతమంది వారి సంతోషం కోసం మరొకరిని ఈజీగా ఇబ్బందిపెడుతుంటారు. దాని వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో వారికి తెలీదు. ఏదో సరదా అనుకుంటారు. ఈ వీడియోని IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ ఈ వీడియోను షేర్ చేశారు. ఓ ఏనుగు టీ తోట గుండా వెళ్తుంది. కార్లు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. దాని పని అది చేసుకుంటుంటే ..ఓ కుర్రాడు ఏనుగును పరుగులు తీయించడం ..అది వెంటబడితే పరుగు తియ్యడం చేస్తున్నాడు. పరిస్థితులు అన్ని మనకి అనుకూలంగా ఉండవు. కొన్ని సార్లు ఏనుగులు చాలా భయంకరంగా రియాక్ట్ అవుతాయంటూ ప్రవీణ్ కస్వీన్ ఈ వీడియోను షేర్ చేశారు.


ఓ యువకుడు ఏనుగు దగ్గరికి వెళ్లి దాన్ని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఏనుగు వెనక్కి వెళ్లినప్పుడల్లా ఆ యువకుడు దాని వెంటే వెళ్లి పదే పదే వేధిస్తున్నాడు. ఇంతలో మరికొన్ని ఏనుగులు కూడా రోడ్డు దాటేందుకు వచ్చాయి. కానీ, అవి వెళ్లిపోయిన తర్వాత మొదటి ఏనుగు కూడా రోడ్డు దాటుతుంది. ఈ సమయంలో యువకుడు ఏనుగులను వెంబడిస్తూ వెళ్తున్నాడు.


మరో పోస్ట్‌లో, ఏనుగులపై పరిశోధనలు చేస్తున్న ప్రవీణ్ కస్వాన్..ఏనుగులు చాలా తెలివైనవి ...మనం వాటికి హాని చేయమనే విషయాన్ని చాలా ఫాస్ట్ గా గ్రహిస్తాయి. కాని ఇలాంటి పిచ్చి ఆటలు ఏనుగులో కోపాన్ని పెంచుతాయి. వాటి ఆరోగ్యం, ప్రవర్తనను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని రాశారు. ఇది జంతువులకు, మానవులకు ప్రమాదకరం అంటూ ప్రవీణ్ కస్వాన్ ఐఎఫ్ఎస్ హెచ్చరించారు.

 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-video elephant

Related Articles