సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పినట్లు వివరించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ నిలకడగా ఉంది. ప్రమాదం కూడా ఏం లేదని తెలిపారు డాక్టర్లు. కత్తిపోట్ల కారణంగా సైఫ్ వెన్నెముకకు గాయం అయిందని లీలావతి ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలపారు. మెడపైనా కత్తి గాయం అయిందని వివరించారు. వెనుక నుంచి దాడి చేయడం వల్ల సైఫ్ వీపు భాగంలో ఇరుక్కుపోయిన కత్తి మొనను బయటకు తీసినట్లు టాక్. అంతేకాదు సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆయన ప్రాణాలకు ప్రమాదం తప్పినట్లు వివరించారు.
అసలు ఏమైందంటే ...బుధవారం రాత్రి 2:30 గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ ఓ దుండగుడు హీరోపై దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం దుండగుడు పారిపోగా సైఫ్ కుమారుడు ఇబ్రహీం తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే సైఫ్ కు చాలా రక్తం పోయింది. సమయానికి కారు లేకపోవడంతో ఆటో లో సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దుండగుడి దాడిలో సైఫ్ కు ఆరుచోట్ల గాయాలయ్యాయని తెలుస్తోంది.