kashmir: కశ్మీర్ లో ఏం జరుగుతుంది ..ఎందుకు ఈ మరణాలు !

బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్‌లకు పంపించింది జమ్ము కశ్మీర్ ప్రభుత్వం.


Published Jan 17, 2025 01:28:00 PM
postImages/2025-01-17/1737100773_s638725166273450604IMG0996.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  భూతల స్వర్గం కాశ్మీర్ లో డజనుకు పైగా మరణాలు సంభవించాయి. ఏం జరుగుతుందో..అసలు ఈ మరణాలేంటో తెలుసుకోవాలనుకున్న అధికారులకు కూడా విషయం అర్ధం కావడం లేదు. రాజౌరీ జిల్లాలోని బుధాల్‌ గ్రామంలో అనుమానాస్పద మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెలన్నర వ్యవధిలో 15 మంది చనిపోయారు .మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్‌లకు పంపించింది జమ్ము కశ్మీర్ ప్రభుత్వం.


అక్కడ రిపోర్ట్స్ లో బాక్టీరియా కాని ..వైరస్ కాని కారణం కాదని రిపోర్ట్స్ వచ్చాయి. ఐఐటీఆర్‌ మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది. మరణాల మిస్టరీ కోసం ఓ కమిటీని వేసింది ప్రభుత్వం. బుధాల్ గ్రామంలో డిసెంబర్ 7న సహపంక్తి భోజనం చేశారు. అక్కడ భోజనం చేసిన 7 కి అస్వస్థత కలిగింది. అందులో 5 గురు చనిపోయారు.బుధవారం రాత్రి ఓ బాలిక చనిపోయింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. నెలన్నర వ్యవధిలోనే మొత్తం 15 మంది చనిపోయారు. దీంతో గ్రామస్తులంతా భయంతో వణికిపోతున్నారు. 


అయితే ఈ భోజనాలు చేసిన వారికే అధిక జ్వరం , వాంతులు లాంటి లక్షణాలున్నాయని అంటున్నారు. విందు భోజనంలో విషం కలిసిందా లేక మరేదైనా ఎత్తు వేస్తున్నారా అనేది కమిటీ దర్యాప్తులో తెలియాలి.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news family-death kashmir

Related Articles