ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికులు ఎంతో ఆనందంగా ఉన్నారని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్న కానీ, మహిళా ప్రయాణికుల పట్ల కండక్టర్లు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు
న్యూస్ లైన్ డెస్క్: ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళా ప్రయాణికులు ఎంతో ఆనందంగా ఉన్నారని ప్రభుత్వాలు చెబుతూ వస్తున్న కానీ, మహిళా ప్రయాణికుల పట్ల కండక్టర్లు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. అయితే తాజాగా ఈ ఘటన మాత్రం ఆర్టీసీకే మచ్చగా చెప్పవచ్చు. ఒక మహిళా ప్రయాణికురాలిని ఈ కండక్టర్ చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారట. తన ప్రయాణంలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని సోషల్ మీడియా వేదికగా విషయాన్ని బయటపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒక మహిళ 23/09/2024 రోజున TGSRTC (TS07UG6541) ఎక్స్ప్రెస్ బస్సులో జడ్చర్ల నుండి హైదరాబాదుకు వెళుతోందట. ఈ సమయంలో ఒక కండక్టర్ తనతో దురుసుగా ప్రవర్తించి తనను అనుచితంగా అక్కడక్కడ తాకాడట. ఆ ప్రయాణంలో తాను చాలా హింస ఎదుర్కొన్నానని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఈ కండక్టర్ ఇలా ఎంతమంది మహిళలను వేధించారో, మీరే ఊహించుకోండి.
ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రయాణికుల పట్ల ఇలా బిహేవ్ చేయడం చాలా బాధాకరం అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు దీనిపై టీజీఎస్ ఆర్టీసీ పై అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు పరిశీలించాలని కోరుకున్నది. దీనిపై వారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
https://x.com/sarayuuuuu/status/1838750562680213589?t=ludiDhIxcY70ApOrrjJWjw&s=08