ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి హార్డ్ డిస్క్‌లో 200కు పైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సినీ నటుడు రాజ్ తరుణ్ -లావణ్య కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి నోరు విప్పాడు. తన హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రైవేట్ వీడియోల్లో ఉన్న మహిళల గురించి వెల్లడించాడు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ కాగా, నిన్న రాజ్ తరుణ్-లావణ్య కేసులో నార్సింగి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి తన ప్రైవేట్ వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేశాడని , రాజ్ తరుణ్ కు తనకు మధ్య గొడవలకు కారణమే మస్తాన్ సాయి అని తెలిపింది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి హార్డ్ డిస్క్‌లో 200కు పైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.
న్యూడ్ వీడియోస్ లో ఉన్నది వేరే వాళ్లు కాదని ... తన భార్యేనని, కొన్ని వీడియోల్లో గాళ్ ఫ్రెండ్ కూడా ఉందని పేర్కొన్నాడు. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించినట్టు చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ హార్డ్ డిస్క్‌లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు.