వియాటినా-19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దీని బరువు ఏకంగా 1,101 కిలోలు. సేమ్ బ్రీడ్ ఆవులతో పోల్చి చూసినా ఇది చాలా ఎక్కువ.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బ్రెజిల్ ఆవుల వేలంలో నెల్లూరు జాతి ఆవు కనకవర్షం కురిపించింది. 4.8 మిలియన్ డాలర్లు అంటే మన డబ్బులో దాదాపు 40 కోట్ల రూపాయిలకు అమ్ముడయ్యింది. ఈ ధర తో అమ్ముడయినందుకు ఏకంగా గిన్నిస్ రికార్డులకెక్కింది. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో నిర్వహించిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవును వేలం వేయగా ఓ వ్యక్తి దానిని ఈ మొత్తానికి సొంతం చేసుకున్నాడు. దీని బరువు ఏకంగా 1,101 కిలోలు. సేమ్ బ్రీడ్ ఆవులతో పోల్చి చూసినా ఇది చాలా ఎక్కువ.
అత్యధిక ధర పలికిన వియాటినా-19 గోవుగా రికార్డులకెక్కిన ఈ ఆవు.. గతంలోనూ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఆవు అత్యంత అరుదైన జన్యువులు కలిగిన ఆవు . ‘చాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’ అవార్డు అందుకుంది. ఈ ఆవు అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. ఈ బ్రీడ్ ఆవులలో ఇదే ఉత్తమైన జాతి ఆవు.
ఇవే ఆవులను మనం ఒంగోలు జాతిగా పిలుస్తుంటాం. ఇవి అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని మనుగడ సాగించగలవు. 1800 సంవత్సరాల క్రితం ఈ జాతి ఆవులు బ్రెజిల్ కు ఎగుమతి అయ్యాయి. వీటిలో ఇమ్యూనిటీ ఎక్కువగాగ ఉంటుంది. దీని వల్ల ఈ ఆవులపై పెట్టుబడి పెడితే నష్టాలుండవని ఫారన్ రైతులు భావిస్తారట.