Viral Videos: కలికాలమే ఇది...ఒక్క కుర్రాడి కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు !

బీహ‌ర్ రాష్ట్రం పూర్నియా జిల్లాలోని గులాబ్‌బాగ్ హ‌న్స్‌దా రోడ్ స‌మీపంలో ఉండే ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.


Published Feb 04, 2025 03:49:00 PM
postImages/2025-02-04/1738664498_FightHero.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఒకే కుర్రాడిని ప్రేమించి ఇద్దరు స్కూల్ అమ్మాయిలు రోడ్డు పై కొట్టుకున్నారు. స్కూల్ యూనిఫాంలో ఉన్న వారిద్ద‌రూ రోడ్డుపై జుట్టుప‌ట్టుకుని మ‌రీ కొట్టుకోవ‌డం వీడియోలో ఉంది. బీహ‌ర్ రాష్ట్రం పూర్నియా జిల్లాలోని గులాబ్‌బాగ్ హ‌న్స్‌దా రోడ్ స‌మీపంలో ఉండే ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.  ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. 


స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే అబ్బాయిని ప్రేమించిన సంగతి తెలుసుకొని విద్యార్ధినులు ముందుగా వాదనకు దిగారు. అలా వాదన కాస్త  ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకున్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌ వారికి వాళ్ల స్నేహితులు తోడ‌య్యారు.  రోడ్డు పై ఉన్నామన్న ధ్యాస లేకుండా పొట్టు పొట్టు కొట్టుకున్నారు.


దాంతో గొడ‌వ కాస్త ముదిరి రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన విద్యార్థినులు రోడ్డుపై ఘోరంగా కొట్టుకున్నారు. దారిన పోయే వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . వీడియో చూసిన నెటిజ‌న్లు "బుద్ధిగా చదువుకోవాల్సిన స‌మ‌యంలో ఇలాంటి దిక్కుమాలిన ప‌నులేంటి?" అని కామెంట్స్ చేస్తున్నారు. 

 

Related Articles