ఖతం..! 


Published Feb 04, 2025 02:01:02 PM
postImages/2025-02-04/1738657862_famer.jpg

రైతు భరోసా పైసలు

ఖతం..! 

భరోసా కోసం రూ.10 వేల కోట్లు అప్పు

400 ఎకరాలు బ్యాంకు తనఖా పెట్టి..

రూ.10 వేల కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్

భరోసా కోసం ఇప్పటి వరకు రూ.560 కోట్లే విడుదల

పథకం ప్రారంభించిన వారం దాటినా..

రైతుల ఖాతాలో పడని భరోసా పైసలు

ఖజానా ఖాళీ కావడమే కారణమంటూ లీకులు

మరి మిగతా రూ.9,440 కోట్లు ఏమైనట్టు ?

మరో 400 ఎకరాలు తనఖా పెట్టేందుకు..

ప్రయత్నాలు మొదలు పెట్టిన రేవంత్ ప్రభుత్వం ?

 

 

 రైతుభరోసా చేసేస్తామంటూ రూ.10వేల కోట్లు తెచ్చింది రేవంత్ సర్కార్. బ్యాంకుల దగ్గర టీజీఐఐసీ భూములను తనఖా పెట్టి మరీ ఈ భారీ మొత్తాన్ని పొందింది. 3 నుంచి 10 ఏళ్ల కాలవ్యవధితో బాండ్లను విడుదల చేసి, నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌ ద్వారా రుణాన్ని సేకరించింది. అయితే ఇప్పుడా డబ్బులు ఏమయ్యాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొన్న రైతుభరోసా కింది విడుదల చేసింది కేవలం రూ.560 కోట్లు మాత్రమేకాగా, మిగిలిన డబ్బులు ఏమయ్యాయన్న చర్చ జరుగుతోంది. అప్పుడే ఖజానా ఖాళీ అయ్యిందన్న వార్త కూడా చక్కర్లు కొడుతోంది. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామన్న సర్కార్.. ఇంకా చాలా మందికి వేయలేదన్న గుసగుసలు వినపడుతున్నాయి. రైతుభరోసా డబ్బుల కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నా.. ప్రభుత్వం ఇంకా ఏమార్పు మాటలు చెప్పడానికే ప్రయత్నిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 03): రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు తమ ఫోన్లను తరుచూ చెక్ చేసుకుంటున్నారు. టకీటకీమన్న సౌండ్ కోసం ఎదురుచూస్తున్నారు. రైతుభరోసా కోసం 400 ఎకరాల భూమిని సెక్యూరిటీగా చూపించి రూ.10 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం ఆ డబ్బులను ఏం చేసిందా అని చర్చించుకుంటున్నారు. భూములను తనఖా పెట్టి  బాండ్ల రూపంలో సమకూర్చుకున్న డబ్బు ఏమయ్యిందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మొదటి విడతగా ఇటీవల కేవలం రూ.560 కోట్లను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం, మిగిలిన రూ.9,440 కోట్లను ఏం చేసిందన్న చర్చ రైతుల్లో జరుగుతోంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ ఛేంజ్(ఎన్‌ఎస్ఈ) ద్వారా సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసి మరీ టీజీఐఐసీ ఈ రుణాన్ని సేకరించింది. మూడేళ్ల నుంచి పదేళ్ల కాల వ్యవధితో ఈ బాండ్లను విడుదల చేసింది. ఈ రుణ సేకరణలో ఐసీఐసీఐ బ్యాంకు మీడియేటర్‌గా వ్యవహరించడం విశేషం.

 

బాండ్ల ద్వారా సేకరించిన నిధులను ప్రభుత్వం రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలకు వినియోగించనున్నట్టు నాడు ప్రచారం జరిగింది. రైతుల ఖాతాల్లో జమ చేయకుండా, అటు ప్రభుత్వ పథకాలకు కేటాయించకుండా అన్ని వేల కోట్లను ప్రభుత్వం ఏం చేసిందా అన్న చర్చ జరుగుతుంది. బడాబడా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు చూస్తున్న ప్రభుత్వం తమను మాత్రం పస్తులు పెడుతోందని రైతాంగం మండిపడుతోంది. ఒకపక్కన ఖజానాలో డబ్బులు ఖాళీ అయ్యాయన్న చర్చ జరుగుతుంటే, మరోపక్కన డబ్బులు ఏమయ్యాయన్న రైతులు నిలదీస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పే సర్కార్ పెద్దలు, అప్పులు చేయడంలో మాత్రం ముందుంటున్నారు. నెలవారీగా రాబడి వస్తున్నా.. అప్పుల పేరుతో వడ్డీలు కడుతున్నామని, జీతాలు ఇస్తున్నామని చెప్పుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు.

 

మరోవైపు రైతులేమో యాసంగి పంటకు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయని ఎదురు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే పదివేల కోట్లను దేనికి ఖర్చు పెట్టిందన్నది చర్చనీయాంశమైంది. ప్రభుత్వం నేరుగా అప్పు చేస్తే విమర్శలు వస్తాయనే భయంతో టీజీఐఐసీకి భూములు బదలాయించి, అక్కడి నుంచి బాండ్ల ద్వారా డబ్బులు పొందింది. దీనికోసం గతేడాది జూన్‌ 26న 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 54ను కూడా జారీ చేయడం విశేషం. అన్ని కోట్లను ప్రభుత్వం అప్పు చేసి, చివరికి రైతులకు ఇవ్వకుండానే ఖజానా ఖాళీ చేసిందా అన్న చర్చ జరుగుతుంది

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress telanganam farmers

Related Articles