Rains: వానలు ఆగాలని ప్రదక్షిణలు.. ఏక్కడంటే

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానలు ఆగాలని ప్రదక్షిణలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తుపానులు, వరదల నుంచి రక్షణ కోసం చిల్కూరు బాలాజీ భక్తులు రెండు అదనపు ప్రదక్షిణలు నిర్వహించారు.


Published Sep 07, 2024 02:41:23 PM
postImages/2024-09-07/1725700283_tempoo.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానలు ఆగాలని ప్రదక్షిణలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో తుపానులు, వరదల నుంచి రక్షణ కోసం చిల్కూరు బాలాజీ భక్తులు రెండు అదనపు ప్రదక్షిణలు నిర్వహించారు. వరద సహాయానికి అన్ని విధాలుగా  సహకరించిన ప్రజలందరికీ స్వామివారి దివ్యమైన ఆశీస్సుల కొరకు ప్రార్థించారు. రెండు తెలుగు రాష్ట్రాలు వరుణదేవుని ఉగ్రతను ఎదుర్కొన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితులలో చిల్కూరు బాలాజీ మళ్లీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనల్ని మరింత విధ్వంసం నుండి రక్షించాలని ప్రార్థించడం జరిగింది.

తుఫాన్, రాబోయే ప్రమాదం నుండి మరింత వర్షాలు పడకుండా జల ప్రళయం కలగకుండా  సుదర్శన అష్టకం పఠించడంతో పాటు గోవింద నామస్మరణతో  శక్తివంతమైన ప్రదక్షిణలు చిలుకూరులో నిర్వహించారు. సకల జీవుల భద్రత కోసం ప్రార్థనలు చేశారు. వరదలు, విధ్వంసం, అనారోగ్యం, గాయం, విపత్తు, ఆకస్మిక మరణాల నుండి రక్షణ కోసం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సంక్షోభ సమయంలో గోవింద నామస్మరణతో కూడిన ప్రదక్షిణం నిర్వహించడాన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ ప్రార్థనలతో కూడిన ప్రదక్షిణలే చిలుకూరులో నిర్వహించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సహచరులు సహాయక చర్యలకు చేస్తున్న కృషికి ప్రత్యేక ప్రశంసలు తెలుపుతూ చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్ రంగరాజన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సత్వర సహాయం కోసం విరివిగా విరాళాలు అందించాలని కోరారు. 

newsline-whatsapp-channel
Tags : telangana venkatewsra-temple temple pandithulu

Related Articles