ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ. 1,11,111కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం . కాని పందెంలో చనిపోయిన కోడికి కూడా చాలా గిరాకీ ఉంటుంది. అయితే పందెంలో పోరాడి చనిపోయిన కోడి లక్ష రూపాయిలకు దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఏలూరుకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ కలిసి పందెం కోసం కోడిపుంజును పెంచారు. గురువారం జరిగిన కోడిపందెంలో అది తుదికంటా పోరాడి ఓడిపోయింది. దీంతో వారు ఈ పుంజును కాల్చి వేలానికి పెట్టారు. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ. 1,11,111కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.