న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రీసెంట్ గా పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే ...అధిక బరువు . మనం తినే ఫుడ్ అలాంటిది. జంక్ ఫుడ్ , ఫాస్ట్ ఫుడ్ వంటివి శరీరంలో కొవ్వు పేరుుపోయేందుకు కారణం అవుతున్నాయి. అధిక బరువు ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలు తీసుకువస్తుంది. దీనిని గుర్తించి బరువు తగ్గించేందుకు ఎంతో మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి 80 శాతం భోజనం తగ్గించి 20 శాతం ఫిజికల్ ఫిట్ నెస్ మీద ఫోకస్ చేస్తే బరువు తగ్గుతారు.
గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ చక్కగా ఉంటాయి. కాబట్టి బరువు మరింత తగ్గడానికి ...శరీరంలో టాక్సిక్స్ బయటకు పోవడానికి మంచి ఆప్షన్ గ్రీన్ టీ
* భోజనం తర్వాత ఐస్ క్రీమ్ లు, ఇతర చక్కెర ఉండే పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. దానికి బదులు ఏవైనా పండ్లు వంటివి తీసుకోవడం మంచిది.
* భోజన సమయానికి ముందు ఐదు, పది నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ ను ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు మీరు భోజనం చేశాక కూడా మీకు ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నయంటే మీకు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయని అర్ధం. అవి చెక్ చేసుకొండి.
*భోజనం తిన్నాక ఇంకా తినాలనిపిస్తే ఓ సారి లేచి పది సెకన్లు నడిచి వచ్చి కూర్చొండి. మళ్లీ తినాలనే ఆలోచన పోతుంది.
*ఫోన్ , టీవీ చూస్తూ తినకండి . ఇలా అయితే ఎక్కువ తినేస్తారు. నెమ్మదిగా బాగా నమిలి తినండి. దీని వల్ల తక్కువ బోజనం ఎక్కువ సేపు తింటారు.