ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ స్కామర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ చాలామంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర అకౌంట్లను హ్యాక్ చేసి వారి పేర్లతో ఇతరులకు మెసేజ్ లు చేసి డబ్బులు లాగే
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ స్కామర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ చాలామంది ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర అకౌంట్లను హ్యాక్ చేసి వారి పేర్లతో ఇతరులకు మెసేజ్ లు చేసి డబ్బులు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో సామాన్యులు ఇరుక్కున్నారు అంటే ఏమో అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఇప్పటివరకు ఈ స్కామర్ల బారిన పడ్డారు. ఈ స్కామర్లు చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచుడ్ ను కూడా వదలలేదు.
అయితే ఆయన ఫోటోతో ఒకరు నకిలీ ఐడి క్రియేట్ చేసి డబ్బులు అడగడం మొదలుపెట్టారు. అయితే ఈ స్కామర్ నుంచి ఒక వ్యక్తికి ఎక్స్ లో జస్టిస్ చంద్రచూడ్ పేరుతో మెసేజ్ వచ్చిందట. ఆ వచ్చిన మెసేజ్ ను ఓపెన్ చేయగానే అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోటో కనిపిస్తుందట. ఈ విధంగా వచ్చిన మెసేజ్ ను మెగవాల్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన ఎవరో స్కామర్ తాను సీజేఐగా పరిచయం చేసుకొని , తనకు అత్యవసర కొలీజియం సమావేశం ఉందని పేర్కొన్నాడు.
తాను ఢిల్లీలోని కన్నట్ ప్లేస్ లో చిక్కుకున్నారని, క్యాబ్ కు అత్యవసరంగా 500 రూపాయల అవసరమని చెప్పాడు. కోర్టుకు వచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇస్తానని అందులో పేర్కొన్నాడు. మెసేజ్ చివరలో ఇది నిజంగా సీజేఐ పంపినట్లుగా ఐప్యాడ్ నుండి పంపబడింది అనే మెసేజ్ కూడా జోడించాడు.
ఈ విధంగా వచ్చిన మెసేజ్ ని మేఘావాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చూసిన నెటిజన్స్ అంతా అవాక్కవుతున్నారు. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో సుప్రీంకోర్టు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మరి ఇందులో జస్టిస్ పేరుతో స్కామింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి ఎవరనేది దర్యాప్తులో తేలనుంది.