AUTO : ఇక పై ఆటో సర్వీసులు 1 రూపాయికే..ఆన్ లైన్ బుకింగ్ చేస్తే చాలు !


రూపాయికే ఆటోను బుక్ చేసుకుని వెళ్లొచ్చు. రూ. 1కే ప్రయాణం .అయితే ఈ ఆఫర్ మనదగ్గర కాదండోయ్. బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది


Published Oct 02, 2024 07:54:41 AM
postImages/2024-10-02/1727873593_Untitled29.png


న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : డైరక్ట్ గా ఆటో మాట్లాడి ...బేరం చేసుకొని వెళ్లే రోజులు పోయాయి. జస్ట్ ఫోన్ ఉంటే ..బుకింగ్ అంతే..ఇంటి ముందే ఎక్కాలి..ఇంటి ముందే దిగాలి. పెద్దగా స్ట్రెయిన్ అవ్వడానికి ఇష్టపడడం లేదు జనాలు. ఇక ఛార్జీల మాట చెప్పకండి..గతి లేక గోకించుకున్నట్లు ఉంటుంది ఈ ఆటో వాళ్లతో వ్యవహారం. అప్పటి వరకు ఓ రేటు పండుగలు ...ఏదైనా స్పెషల్ డేస్ వస్తే ఒక రేటు ..తప్పదు సంపాదించుకునేది ఒక్కరోజే అనుకుంటారేమో. కాని ఇక పై ఆటో సర్వీసులు జస్ట్ రూపాయికే ప్రకటిచారు  ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వారు.


రూపాయికే ఆటోను బుక్ చేసుకుని వెళ్లొచ్చు. రూ. 1కే ప్రయాణం .అయితే ఈ ఆఫర్ మనదగ్గర కాదండోయ్. బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని కోసం స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. మీకు తెలుసని అడిగితేనే ఈ ఆఫర్. తెలీకపోతే నార్మల్ గా వసూలు చేస్తారు.


రద్దీ సమయాల్లో రూ. 1కే రైడ్ లను అందిస్తోంది. రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం, క్యాష్ లెస్ సేవలను ప్రమోట్ చేసేందుకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. సిటీలో ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్. అది కూడా నాలుగు రోజులు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. సో ఫ్రెండ్స్ బెంగుళూరులో ఫ్రెండ్స్ లేని వాళ్లు ఎవరుంటారు...చెప్పేయండి ..మీ వాళ్లకి ఆటో 1 రూపాయికే అని..
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bengalore flipkart upi-payments auto-ride-booking

Related Articles