Movies: దేవుళ్ళు ఉంటే బొమ్మ బ్లాక్ బస్టరే..అంతా దేవుళ్ల మహిమేనా.?

ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా కథలు చూసినా, దేవుళ్ళ బ్యాగ్రౌండ్ మీదనే వస్తున్నాయి.ఈ  చిత్రంలో దేవుడి బొమ్మ కనిపిస్తే చాలు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతోంది.తాజాగా సోషియా ఫాంటసీ సినిమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాంటి చిత్రం వచ్చిన అద్భుతమైన హిట్ అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తేజ సజ్జ హనుమాన్, ప్రభాస్ కల్కి, నందమూరి బాలయ్య అఖండ, నిఖిల్ కార్తికేయ2, ఇలా సోషియో ఫాంటసీలో ఎలాంటి చిత్రాలు వచ్చిన బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతోంది. అలాంటి ఈ తరుణంలో సోషియో ఫాంటసీలతో ఎలాంటి చిత్రాలు వచ్చిన జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.  దీంతో సినిమాల్లో తప్పనిసరిగా దేవుళ్ళు కనిపించేలా డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.  


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721365014_movies.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా కథలు చూసినా, దేవుళ్ళ బ్యాగ్రౌండ్ మీదనే వస్తున్నాయి.ఈ  చిత్రంలో దేవుడి బొమ్మ కనిపిస్తే చాలు ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతోంది. అయితే ఈ చిత్రాలను ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలోనే తీశారు. రామాయణం, మహాభారతల మీద కూడా ఎన్నో చిత్రాలు వచ్చాయి.  ఆ టైంలో కూడా భారీ హిట్స్ కొట్టాయి.  

ఇక వీరి తర్వాత కొన్నేళ్లపాటు ఇలాంటి తరహాలో సినిమాలు రాలేదు.  కానీ తాజాగా సోషియా ఫాంటసీ సినిమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎలాంటి చిత్రం వచ్చిన అద్భుతమైన హిట్ అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తేజ సజ్జ హనుమాన్, ప్రభాస్ కల్కి, నందమూరి బాలయ్య అఖండ, నిఖిల్ కార్తికేయ2,కాంతార ఇలా సోషియో ఫాంటసీలో ఎలాంటి చిత్రాలు వచ్చిన బొమ్మ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతోంది.

అలాంటి ఈ తరుణంలో సోషియో ఫాంటసీలతో ఎలాంటి చిత్రాలు వచ్చిన జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.   దీంతో సినిమాల్లో తప్పనిసరిగా దేవుళ్ళు కనిపించేలా డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.  అంతేకాకుండా రాబోవు చిరంజీవి మూవీ విశ్వంబరా మూవీ కూడా సోషియో ఫాంటసీ బ్యాట్ డ్రాప్ లో రూపొందుతుందట.

నిఖిల్ హీరోగా స్వయంభు మూవీ,  కార్తికేయ3 కూడా దైవభక్తి చుట్టే తిరుగుతాయట. అంతేకాకుండా అనసూయ ప్రధాన పాత్రలో అరి చిత్రం కూడా భక్తి రసభావంతో వస్తోందని తెలుస్తోంది. ఈ విధంగా చాలామంది డైరెక్టర్లు సోషల్ పాంటసి సినిమాలు తీయడానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : kalki-2898-ad newslinetelugu akhanda karthikeya-2 vishwambhara swayambhu hanu-man

Related Articles