ఇస్రో చంద్రయాన్ -4 మిషన్ లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే ఈ సంస్థ లక్ష్యం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: చంద్రయాన్ -4 మిషన్ కి సంబంధించి అభివృధ్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో ముందడుగు పడింది. ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ " స్పేస్ కిడ్జ్ ఇండియా " కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో చంద్రయాన్ -4 మిషన్ లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే ఈ సంస్థ లక్ష్యం.
ఈ కార్యక్రమంలో.. భాగంగా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శక్తి శాట్ మిషన్ ద్వారా 108 దేశాలకు చెందిన 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న 12,000 మంది హైస్కూల్ విద్యార్ధినులకు స్పేస్ టెక్నాలజీ , పేలోడ్ అభివృధ్ధి , వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్ లైన్ ట్రైనింగ్ శిక్షణ ఇస్తున్నారు. . బ్రిటన్, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. అయితే శిక్షణ అనంతరం ప్రతి దేశం నుంచి ఒక స్టూడెంట్ తరుపున మొత్తం 108 మందికి ఎంపిక చేస్తారు. వీరికి పేలోడ్ లు , స్పేస్ క్రాఫ్ట్ ప్రొటో టైప్ లను రూపొందించడంలో శిక్షణ ఇస్తారు.
ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ఉపగ్రహాన్ని ప్రయోగించాలని లక్ష్యంగా ..ప్రపంచ దేశాల బాలికలను ప్రోత్సహించడం ద్వారా సాధికారతను కల్పించాలి. ఇప్పటి వరకు 18 కి పైగా బెలూన్ శాటిలైట్లు , 3 సబ్ ఆర్బిటల్ పేలోడ్ లు ,4 ఆర్పిటల్ ఉపగ్రహాలను ప్రయోగించింది.