JAMMU & KASHMIR: జమ్ము కశ్మీర్‌ లోయలో భారీ భూకంపం !

జమ్ము కశ్మీర్ లోయలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భుకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 


Published Nov 13, 2024 07:00:00 PM
postImages/2024-11-13/1731504691_6BE0F043940B436DA01F3D5E7DC687CB.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జమ్ము కాశ్మీర్ లోయలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు  పై భూకంప తీవ్రత కూడా 5.2 గా నమోదయినట్లు వాతావరణ కేంద్రం సంభవించింది.  జమ్ము కశ్మీర్ లోయలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భుకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. 


యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. భూకంపం తీవ్రత 5.1గా ఉంది. అయితే, పాకిస్థాన్‌ వాతావరణ విభాగం దానిని 5.3 తీవ్రతగా నివేదించింది. భూకంపం కేంద్రం ఆఫ్ఘానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో కూడా వచ్చినట్లు...ఇస్లామాబాద్‌లోని నేషనల్‌ సీస్మిక్‌ మానిటరింగ్‌ సెంటర్‌ తెలిపింది. భూమికి 220 కిమీ లోతులో ఇది సంభవించినట్లు తెలిపారు.


ఈ భూకంపం ధాటికి లోయలోని పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కశ్మీర్‌ లోయతోపాటు పాకిస్థాన్‌లోని ఖైబర్‌ఫంక్తుఖ్వా, ఇస్లామాబాద్, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అంతేకాదు కొండ ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం వెంటనే అలర్ట్ చేసింది. లఢఖ్ లాంటి ప్లేసుల్లో ప్రయాణాలు రెండు రోజులు ప్రమాదకరమని తెలిపింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news jammu-kashmir earth

Related Articles