న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సీనియర్ ఐఏఎస్ , తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. అద్దె కారు విషయంలో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులు సిధ్ధమవుతున్నారు. న్యాయ నిపుణుల సూచనలు తీసుకొని ఆ తర్వాత ఆమె నుంచి రావాల్సిన సొమ్మును రాబట్టేందుకు సిధ్ధమవుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయడానికి రంగం సిధ్ధం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ కీలక పోస్టుల్లో పనిచేసిన విషయం తెలిసిందే. ఆమె సీఎంఓ అదనపు కార్యదర్శి గా ఉన్న టైంలో 2016 అక్టోబర్ నెల నుంచి 2024 మార్చి నెల వరకు ఓ కారును అద్దెకు తీసుకున్నారు. ఆ కారుకు నెలకు 63 వేల చొప్పున జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ నుంచి రెంట్ తీసుకున్నారు. అయితే యూనివర్మిటీ రూల్స్ ప్రకారం అద్దెపేరిట 90 నెలలకు రూ.61లక్షలు తీసుకున్నట్లు ఇటీవల ఆడిట్ లో అధికారులు గుర్తించారు. దీంతో కొత్త కార్లే కొనచ్చు. కాబట్టి ఆడిట్ విభాగం దీనిపై అభ్యంతరం తెలిపింది. దీంతో అధికారులు వాటిని రికవరీ చెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
స్మితా అద్దెకు తీసుకున్న కారు నాన్ టాక్స్ , ఎల్లో ప్లేట్ వెహికల్ కాదు. ఓ వ్యక్తి పేరిట ఆ వాహనం ఉంది. అయితే ప్రతి నెల వాహనం అద్దె రిసిప్టులు రావడంతో వర్శిటీ యాజమాన్యం ప్రతి నెల డబ్బులు కట్టింది. దీనిపై స్మితా సబర్వాల్ వెంటనే వివరణ ఇవ్వకపోతే వివాదం ముదిరే అవకాశం ఉంది.