సిరిసిల్ల కలెక్టర్..!


Published Feb 22, 2025 11:43:49 AM
postImages/2025-02-22/1740204829_WhatsAppImage20250222at10.29.05AM.jpeg

సిరిసిల్ల కలెక్టర్..!
కేరాఫ్ కాంట్రవర్సీ..! 
వ్యక్తిగత జీవితం నుంచి ఉద్యోగం దాకా అదే తీరు 

మొదటి నుంచి వివాదాస్పదంగా సందీప్ ఝా తీరు
సిరిసిల్లలో టీ స్టాల్ మూసేయించిన కలెక్టర్
మిల్క్ కూలింగ్ యూనిట్ ను సీజ్ చేయించిన వైనం
పాడిరైతులు రోడ్డెక్కడంతో సర్కారుకు తగిలిన సెగ
వెంటనే మిల్క్ కూలింగ్ యూనిట్ తెరిచిన ఎమ్మెల్యే
శుక్రవారం రోజు సిరిసిల్లలో అక్రమంగా రైతు అరెస్ట్
బీఆర్ఎస్ కార్యకర్త జిరాక్స్ సెంటర్ కు తాళం
సర్కారుకు తలనొప్పిగా మారిన కలెక్టర్ వ్యవహారం..!
గతంలో వ్యక్తిగత జీవితంతో వివాదాల్లో సందీప్ ఝా
కట్నం కోసం వేధించారని, అసహజ శృంగారంతో.. 
టార్చర్ పెట్టారని భార్య ఫిర్యాదు
సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందీప్ ఝా వ్యవహారం


ఆయనో ఐఏఎస్ అధికారి. జిల్లా మేజిస్ట్రేట్ అనే మరో గౌరవ ప్రదమైన హోదా కూడా ఉంది. అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన ఇటీవల వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. పేదలు, రైతుల పొట్టకొట్టేలా ఆయన చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన ఆయన.. వారిని ఇబ్బందులు పాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో తన వైవాహిక జీవితం విషయంలో భార్యతో కర్కషంగా వ్యవహరించి వార్తల్లోకి ఎక్కిన ఆయన ఇప్పుడు తమ ఉసురుపోసుకుంటున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 21) : సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం సిరిసిల్లలో కేటీఆర్ ఫొటో ఉందని ఓ టీ స్టాల్ ను మూసేయించారు. ఇష్యూ పెద్దది కావడంతో తాను మూసేయమని చెప్పలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ బతుకమ్మ కుంట దగ్గర ఉన్న టీ స్టాల్ ను శుక్రవారం మున్సిపల్ అధికారులు వచ్చి తమ ట్రాక్టర్ లో వేసుకుని తీసుకెళ్లిపోయారు. దీంతో కన్నీరు మున్సీరుగా విలపించిన బాధితుడు మున్సిపల్ ఆపీసు ముందు ధర్నాకు దిగారు. 
మరోవైపు వేములవాడ శివారులో ఉన్న కరీంనగర్ డెయిరీకి చెందిన మిల్క్ బల్క్ కూలింగ్ కేంద్రాన్ని గురువారం రోజు సీజ్ చేయించారు. సిరిసిల్ల జిల్లాలోని వేలాది మంది రైతులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతీరోజు లక్షలాది లీటర్ల పాలను సేకరించే సంస్థ కేంద్రాన్ని మూసేయడం పెద్ద వివాదంగా మారింది. సిరిసిల్ల జిల్లాలోని పాడి రైతులంతా గురువారం రోజు రాత్రి రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. మిల్క్ కూలింగ్ యూనిట్ ను తెరిచే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయినా కలెక్టర్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది. వివాదం మరింత ముదరడం జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వస్తుండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా వెళ్లి మిల్క్ కూలింగ్ కేంద్రానికి అధికారులు వేసిన సీల్ తొలగించారు. అయితే.. ఈ ఆందోళనల్లో పాల్గొన్నారనే నెపంతో శుక్రవారం రోజు అబ్బాడి రాజిరెడ్డి అనే రైతును కలెక్టర్ అన్యాయంగా అరెస్ట్ చేయించారు. స్థానికంగా ఉన్న ఓ బీఆర్ఎస్ నేత ఇంటి పేరు.. రాజిరెడ్డి ఇంటిపేరు ఒకటే కావడంతో అతడిని అరెస్ట్ చేశారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. గొంతు సర్జరీ అయి ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారని ఆవేధన వ్యక్తం చేశారు. 
కలెక్టర్ అంటే పేదవాళ్లకు అండగా ఉండాలి. వారి సంక్షేమానికి  పాటుపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. కానీ ఇలా ఒక టీస్టాల్ నడుపుతున్న పేద కుటుంబం పొట్టకొట్టడం, వేలాది మంది పాడి రైతులను రోడ్డున పడేయడం వంటి చర్యలు తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పదే పదే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో కలెక్టర్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని కలెక్టర్ల అందరికి భిన్నంగా, విచిత్రంగా ఈయన ఎందుకు వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇదే సమయంలో కలెక్టర్ గత చరిత్ర కూడా బయటకు వస్తోంది. ఉద్యోగ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఆయన తీరు అలాగే ఉంటుందని సమాచారం. వైవాహిక జీవితం చాలా దారుణంగా ఉండేదని తెలుస్తోంది. అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా వేధింపులకు గురిచేశారని సమాచారం. ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి కట్నం తీసుకోవడమే తప్పు. కానీ సందీప్ ఝా మాత్రం రూ.2కోట్లు కట్నంగా తీసుకున్నారట. అంతేకాదు.. అరకిలో బంగారం, విలువైన ఫర్నీచర్ కూడా కొనిపించుకున్నారట. 

అసహజ వైఖరితో వైవాహిక జీవితం పెటాకులు..!
సందీప్ ఝా.. బిహార్ కు చెందిన వారు. ఆయన భార్య పల్లవిది చత్తీస్ గఢ్ లోని కోర్బా. తెలిసిన బంధువుల ద్వారా వీరిద్దరికి పెళ్లి కుదిర్చారు. నవంబర్ 21, 2021 రోజున వీరి వివాహం జరిగింది. కానీ అతికొద్ది కాలంలోనే వీరు విడిపోయారు. సందీప్ కుమార్ ఝా తీవ్రమైన లైంగిక సమస్యతో బాధపడుతున్నారని సమాచారం. పెళ్లైన కొద్దిరోజులకే అసహజ శృంగారం కోసం వేధించాడని ఆయన భార్య పల్లవి ఝా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనేక సార్లు తనతో అసహజ శృంగారం చేశారని.. ప్రైవేట్ పార్ట్స్ కు గాయాలైనప్పటికీ.. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదని ఆమె కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తన భర్త గురించి అత్తామామలకు చెప్పినా వారు ఆయననే సమర్థించేవారట. అతనికి అనారోగ్య సమస్య ఉందని తమకూ తెలుసునని.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పినట్టు తెలుస్తోంది. అతని సహకరించకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరించారట. ఒకసారి ఆమె ముఖంపై దిండును అదిమిపట్టి హత్యకు కూడా ప్రయత్నించారని పల్లవి ఝా కోర్టుకు వివరించారు. ఈ రకమైన టార్చర్ తట్టుకోలేక ఆమె హైదరాబాద్ నందినగర్ లోని ఇంటి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయారని సమాచారం. 

అదనపు కట్నం కోసం వేధింపులు.. 
సందీప్ ఝా, అతని తల్లిదండ్రులు కూడా అదనపు కట్నం కోసం తనను వేధించారని పల్లవి ఝా తన సొంతూరు  కోర్బాలో పోలీసులకు ఫిర్యాదు చేవారు. అయినా వారు కేసు నమోదు చేయలేదని ఎస్పీ వరకు వెళ్లినా పట్టించుకోలేదని తెలుస్తోంది. పెళ్లి సమయంలోనే రూ.2 కోట్ల నగదు, అరకిలో బంగారం ఇచ్చినా.. మరింత కట్నం కావాలని తనను వేధింపులకు గురి చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సమీపంలోని నొయిడాలో రూ. కోటి 30 లక్షలతో ఒక ఫ్లాట్ కూడా కొనిపించారని.. దాన్ని తన భర్త సోదరుడి పేరు మీదకు మార్చాలని అనేకసార్లు వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్లకు కోట్లాది రూపాయలు కట్నంగా ఇస్తారని.. మీరు ఇచ్చింది ఏమాత్రం సరిపోదని అత్తామామలు సూటిపోటి మాటలతో వేధించేవారట. అంతేకాదు.. సందీప్ ఝా కూడా.. భార్య పుట్టింటికి వెళ్లి వచ్చిన ప్రతీసారి డబ్బులు కోసం వేధించేవాడని తెలుస్తోంది. దీంతో ఆమె భరించలేక తన దగ్గర ఉన్న డబ్బులు భర్త అకౌంట్ కి బదిలీ చేసినట్టుగా కోర్టుకు తెలిపారు. భర్త తీరుతో విసిగిపోయి తల్లిగారింటికి వెళ్లిపోయిన తర్వాత కూడా భార్యపై కట్నం కోసం వేధింపులు ఆగలేదని తెలుస్తోంది. గతంలో సందీప్ కుమార్ ఝా ఆసిఫాబాద్ కలెక్టర్ గా పనిచేశారు. అయితే.. అప్పుడు ఆయన చాలా అవినీతికి పాల్పడ్డారనే విషయం కూడా ఆయన భార్యనే బయటపెట్టారు. చాలా మంది వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో లంచాలు వసూలు చేశారని చెప్పారు. కొన్ని కీలకమైన ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లో వేసుకుని ఇంటికి తీసుకొచ్చేవారన్నారు. వాటితో వ్యక్తులను బెదిరించి డబ్బులు తీసుకునే వారని.. వాటిని తన తల్లి కిరణ్ దేవి దగ్గర దాచేవారని కూడా ఫిర్యాదులో వివరించారు. 

దీంతో పల్లవి ఝా తల్లిదండ్రులు కూడా విసిగిపోయారు. ఐఏఎస్ అల్లుడు అని ఆడంబరంగా పెళ్లి  చేస్తే పదే పదే కట్నం కోసం వేధించడం.. అల్లుడేమో కూతురిని శారీరకంగా వేధిస్తుండటంతో ఈ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. విడాకుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అక్కడ విడాకుల సెటిల్ మెంట్ కు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పల్లవి ఝా పెట్టిన కేసులను కోర్టు క్వాష్ చేసింది. ఇప్పుడు సిరిసిల్లలో ఆయన వ్యవహారంతో గత చరిత్ర మొత్తం బయటకు వస్తోంది.

newsline-whatsapp-channel
Tags : mla brs government collector

Related Articles