తెలుగు సహా తమిళ్ భాషల్లో 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా ఇంచు మించు ఈ రెండు భాషల్లో కూడా బిగ్ బాస్ 8 ఒకే సమయానికి షోలు మొదలయ్యేలా ఛానెల్స్ వారు ప్లాన్ చేసుకుంటారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ అనగానే ..ఓ వర్గం ఫ్యాన్స్ ఉంటారు. బిగ్ బాస్ అనగానే అన్ని మరిచిపోతారు. బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ సంబంధించి చాలా మంది ప్రముఖ తరాల నడుమ జరిగే ఓ రసవత్తర హౌస్ డ్రామాగా మొదలైన ఈ రియాలిటీ షో వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యింది. ఇండియాలో అన్ని భాషల్లోను బిగ్ బాస్ చాలా ఫేమస్ అయ్యింది.
తెలుగు సహా తమిళ్ భాషల్లో 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా ఇంచు మించు ఈ రెండు భాషల్లో కూడా బిగ్ బాస్ 8 ఒకే సమయానికి షోలు మొదలయ్యేలా ఛానెల్స్ వారు ప్లాన్ చేసుకుంటారు. తమిళ్ వెర్షన్ కు కమల్ హాసన్ హోస్టింగ్ చేయనని చెప్పేశారు. తన సినిమా డేట్స్ కు ఈ బిగ్ బాస్ క్లాష్ అవుతుందని తెలిపారు. సో ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ కు హోస్ట్ గా విజయ్ సేతుపతిని అనుకుంటున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా తమిళ్ , తెలుగులో చాలా ఫేమస్.
మరి నిజంగానే సేతుపతి కమల్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడా లేదా అనేది వేచి చూడాలి. రీసెంట్ గానే విజయ్ సేతుపతి తన 50వ సినిమాగా "మహారాజ" తో తన కెరీర్ లో బిగ్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఇక మన తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే ఇది కింగ్ నాగార్జున తోనే హోస్ట్ గా కొనసాగనుండగా ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. విజయ్ హోస్ట్ అంటూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.
Actor #VijaySethupathi will be hosting the #BiggBossTamil of this season !! pic.twitter.com/qSg7bgQK6l — Suresh PRO (@SureshPRO_) August 13, 2024