Manda krishna madiga: మీడియా ముందు మంద కృష్ణ భావోద్వేగం

వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయబోయే సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 


Published Aug 01, 2024 02:12:10 AM
postImages/2024-08-01/1722495808_mandakrishna.jpg

న్యూస్ లైన్ డెస్క్: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మీడియా ఎదుట భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని ఆయన అన్నారు. తమ 30 ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం దక్కిందని వెల్లడించారు. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ తీసుకున్నారని తెలిపారు. 

తమకు అండగా నిలిచినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి మందకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనేది చాలా అవసరమని ఆయన అన్నారు. 

వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయబోయే సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుందని వెల్లడించారు. రేనోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణకు జనాభా లెక్కలతో పనిలేదని తెలిపారు. 

కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.  2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును చంద్రచూడ్ ధర్మాసనం పక్కనబెట్టింది. రాష్ట్రాలకు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని స్పష్టం చేసింది. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news newslinetelugu telanganam sc,stclassification y.chandrachud

Related Articles