Mr Bahchan: హరీష్ శంకర్ ను కొడతామంటున్న రవితేజ ఫ్యాన్స్.!

మాస్ మహారాజా రవితేజ ఈయన హీరోగా సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కి ఎన్నో వచనాలు ఉంటాయి.  ఎందుకంటే రవితేజ నటన తీరిలో కానీ, నడవడికలో గాని ఆ విధమైన స్టైల్ ఉంటుంది.  ఆయనను


Published Aug 16, 2024 12:37:04 AM
postImages/2024-08-16/1723786330_harishshankar.jpg

న్యూస్ లైన్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ఈయన హీరోగా సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కి ఎన్నో వచనాలు ఉంటాయి.  ఎందుకంటే రవితేజ నటన తీరిలో కానీ, నడవడికలో గాని ఆ విధమైన స్టైల్ ఉంటుంది.  ఆయనను డైరెక్టర్లు వాడుకోవాలి కానీ అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించవచ్చు. అంతటి టాలెంట్ ఉన్నటువంటి రవితేజను  ఈసారి గ్రేట్ డైరెక్టర్ అని పేరు ఉన్నటువంటి హరీష్  శంకర్ అస్సలు వాడుకోలేకపోయారట.

సినిమాను దారుణంగా తీశారని,  అద్భుతమైన కథ ఉన్నా కానీ డైరెక్టర్ తడబడ్డారని రవితేజ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే హరీష్ శంకర్ అనగానే ఎన్నో అంచనాలు ఉంటాయి. దీంతో మిస్టర్ బచ్చన్ సినిమాపై కూడా అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.  

తీరా సినిమాకి వెళ్లి చూస్తే మాత్రం నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ మూవీలా శంకర్ దీన్ని తీర్చిదిద్దారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.  రీమేక్ చిత్రమైన సరే హరీష్ శంకర్ చాలా డిఫరెంట్ గా   తీస్తారని పేరు ఉంది. కానీ మిస్టర్ బచ్చన్ చిత్రంలో మాత్రం ఆయన దారుణంగా విఫలమయ్యారని  అంటున్నారు. అంతేకాదు హరీష్ శంకర్ దొరికితే  దారుణంగా కొడతామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line raviteja harish-shankar mr-bachchan bagyasri-boorse

Related Articles