Nani : " నాని ఫిల్మ్ం ఇండస్ట్రీ " ఈ లిస్ట్ లో అందరూ తోపు డైరక్టర్లే !

ఇప్పుడు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. నాని సినిమా అంటే పక్కా హిట్టు.


Published Mar 16, 2025 01:29:00 PM
postImages/2025-03-16/1742112032_nanisboldstatementoncourtcreatesbuzzhit3directorsresponseaddshumor.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఓ రకంగా పెద్ద యుధ్ధమే. అన్ని ఉన్నా కాలం కలిసి రాని హీరోలు ఎంతో మంది ఉన్నారు. టాలెంట్ ఉన్నా ...వెనుకబడి ఉన్నవాళ్లు కూడా పరిచయమే. అలాంటి టైం , హార్డ్ వర్క్ ..లక్ అన్ని కలిసివచ్చిన యాక్టర్ నాని . ఇప్పుడు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. నాని సినిమా అంటే పక్కా హిట్టు. తప్పితే యావరేజ్ ...ప్లాప్ మాత్రం ఉండదు. ఫ్లాప్ లు చాలా రేర్. కాని ప్రతి కొత్త డైరక్టర్ ను తను నమ్మి అవకాశాలు ఇస్తాడు.


నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి మెయిన్ లీడ్ గా తెరకెక్కిన కోర్ట్ సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ కొట్టింది. కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. నాని ఇప్పుడే కాదు తను చాలా మంది కొత్త డైరక్టర్స్ ను పరిచయం చేశాడు. కోర్ట్ సినిమా టీమ్ ప్రమోషన్స్ లో, సక్సెస్ మీట్స్ లో నాని ని పొగిడిన విధానం చూస్తే వాళ్లందరికీ నాని ఎంత సపోర్ట్ చేసాడో తెలుస్తుంది.


నాని ఫిల్మ్ం ఇండస్ట్రీ అని కొత్త గా ఓ సపరేట్ ఇండస్ట్రీని క్రియేట్ చేస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్.నాని కెరీర్ లో హీరోగా స్నేహితుడా సినిమాతో డైరెక్టర్ బెల్లంకొండ సత్యం, భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో తాతినేని సత్య, అలా మొదలైంది సినిమాతో నందిని రెడ్డి, సెగ సినిమాతో అంజనా అలీ ఖాన్, ఆహా కళ్యాణం సినిమాతో గోకుల్ కృష్ణ, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో నాగ్ అశ్విన్, నిన్ను కోరి సినిమాతో శివ నిర్వాణ, దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్న సినిమాతో శౌర్యువ్ లను దర్శకులుగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసాడు. నాని ప్రొడ్యూసర్ గా "అ" మూవీ తో ప్రశాంత్ శర్మ, హిట్ మూవీ తో శైలేష్ కొలను , మీట్ క్యూట్ సినిమా తో తన అక్క దీప్తి , కోర్ట్ సినిమా తో రామ్ జగదీశ్ లను డైరక్టర్లుగా మార్చాడు.నాని దర్శకులుగా పరిచయం చేసినవాళ్లు చాలా మంది ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news producer nani court

Related Articles