అంతే కాకుండా విజయవాడలో అందుబాటులోకి పశ్చిమ బైపాస్ వచ్చింది. సంక్రాంతి రద్దీతో బైపాస్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బెజివాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సంధర్భంగా ప్రయాణికులతో బెజవాడ బస్టాండ్ ఖాళీ లేవట. ముందుగా రిజర్వేషన్ ఉన్నప్పటికీ ప్రయాణికులు బస్సులు సరిగ్గా లేకపోవడం ..సరిపోకపోవడంతో 148 అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసారూ అధికారులు.
అంతే కాకుండా విజయవాడలో అందుబాటులోకి పశ్చిమ బైపాస్ వచ్చింది. సంక్రాంతి రద్దీతో బైపాస్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. విజయవాడలో అందుబాటులోకి పశ్చిమ బైపాస్ రావడంతో విజయవాడ నగరం మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తగ్గాయి. దాదాపు 30 నిమిషాల్లో విజయవాడ సిటీ ట్రాఫిక్ ఏం లేకుండా చూసుకుంటున్నాయి. గొల్ల పూడి నుంచి నేరుగా గన్నవరం దగ్గర చినఅవుటుపల్లి మీదుగా ఏలూరు , రాజమండ్రి , విశాఖ వైపు వెళ్తున్నాయి వాహనాలు . దీని వల్ల సిటీ ట్రాఫిక్ తో పాటు టైం సేవ్ అవుతుంది. బస్సులు ఎక్కువ సార్లు తిరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు అధికారులు.