VIRAL: 'నువ్వు ఆడపిల్లకే జన్మనిస్తావ్' నిండు గర్భిణిని ఇంట్లో నుంచి గెంటేసిన ఫ్యామిలీ !

ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి చాలా టార్చర్ పెట్టేవాడు. కూతురు పుట్టిన తర్వాత నుంచి అదనపు కట్నం తీసుకురావాలని పుట్టింటికి పంపించాడు. 


Published Jan 29, 2025 06:25:00 PM
postImages/2025-01-29/1738155444_120067523427386thumbnail16x9pregnant.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో ఓ మూర్ఖుడు నిండు గర్భవతిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు రాజేంద్రనగర్ లో అక్బర్ ఖాన్ , హుమెరా దంపతులు నివసిస్తున్నారు. పెళ్లైనా మొదట్లో ఇద్దరు ఆనందంగానే ఉన్నారు. అయితే ఫస్ట్ కూతురు వారికి కుమార్తె జన్మించింది. అంతే ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి చాలా టార్చర్ పెట్టేవాడు. కూతురు పుట్టిన తర్వాత నుంచి అదనపు కట్నం తీసుకురావాలని పుట్టింటికి పంపించాడు. 


కొట్టడం, డబ్బులు అడగటం, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నుంచి పంపిచేయడం వంటివి చేసేవాడు. భర్త వేధింపులు తాళలేక రైన్ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పలుమార్లు ఫిర్యాదు చేసింది . కాని ఈ మధ్య వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్తమామలు సపోర్ట్ చేస్తున్నారు . 'మళ్లీ నీకు ఆడపిల్లే పుడుతుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో' అంటూ అర్ధరాత్రి నిండు గర్భవతి, ఇద్దరు చిన్నారులను బయటకు గెంటేసాడు. దీంతో అత్తానగర్  పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. తనని ఇంట్లోకి రానివ్వాలని, అక్కడ నుంచి తీసుకెళ్లాలని భర్తకు ఫోన్‌ చేయగా అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news pregnant

Related Articles