కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తల్లి కోసం చిరంజీవి హ్యాపీ బర్త్ డే సాంగ్ ను కూడా పాడారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అమ్మ అంజనాదేవి పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సంధ్భరంగా మెగా నివాసంలో సందడి నెలకొంది. మెగా కుటుంబసభ్యులందరు అంజనాదేవికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఆమె పై పూల వర్షం కురిపించారు. అందరి నుంచి శుభాకాంక్షలు అందుకుంటూ, ఉత్సాహంగా నడుచుకుంటూ వచ్చిన ఆమె... కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తల్లి కోసం చిరంజీవి హ్యాపీ బర్త్ డే సాంగ్ ను కూడా పాడారు.
చిరంజీవి తన తల్లి జన్మదిన వేడుకల గ్లింప్స్ ను ఇన్ స్టా లో పంచుకున్నారు. "అమ్మా... మాటల్లో వర్ణించలేనంత గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాం, నువ్వు ఊహించనంతగా నిన్ను గౌరవిస్తున్నాం అని ఈ ప్రత్యేకమైన రోజున నీకు చెప్పాలని కోరుకుంటున్నాం" అంటూ ఆ వీడియోకు చిరంజీవి క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.