Tucker Carlson: అప్పట్లో పుతిన్ ను చంపేందు బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించింది !

యుద్ధంవైపు నడిపించే వ్యక్తులకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ చక్కని ఉదాహరణ అని అన్నారు. అయితే వీటిని నమ్మించి ఆధారాలు తమ వద్ద లేవని అన్నారు.


Published Jan 29, 2025 01:41:00 PM
postImages/2025-01-29/1738138347_119799865gettyimages10527227241.jpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు జో బైడన్ హయాంలో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హత్య కు కుట్ర జరిగిందని రాజకీయ విశ్లేషకుడు, ఫాక్స్ న్యూస్ మాజీ యాంకర్ టకర్ కార్ల్ సన్ సంచలన ఆరోపణలు చేశారు. బైడెన్ ప్రభుత్వ యంత్రాంగం పుతిన్ ను మట్టుబెట్టడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. అంతే కాదు మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యేలా చేయడమే లక్ష్యంగా బైడెన్ యంత్రాంగం పలు కుట్రలు చేసిందని చెప్పారు. ప్రపంచాన్ని యుద్ధంవైపు నడిపించే వ్యక్తులకు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ చక్కని ఉదాహరణ అని అన్నారు. అయితే వీటిని నమ్మించి ఆధారాలు తమ వద్ద లేవని అన్నారు.


అయినప్పటికి  బైడెన్ గవర్నమెంట్ పై కార్ల్ సన్ మాటలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. కార్ల్ సన్ 2023లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు.  అమెరికాతో పాటు ప్రపంచ రాజకీయాలపై తన విశ్లేషణను తెలుపుతారు . కాగా, కార్ల్ సన్ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు స్పందించలేదు. పుతిన్ కు రష్యన్ స్పెషల్ సర్వీస్ చాలా కఠినమైన భద్రతను ఏర్పాటు చేసింది. సెక్యూరిటీ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది రష్యా. ఇన్ని కామెంట్లు చేసినా ...బైడెన్ గవర్నమెంట్ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని పలువులు రాజకీయనిపుణులు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america russia vladimirputin biden

Related Articles