ఈ ట్రైలర్ ను ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేశారు. అందరూ ఊహించినట్లుగా ట్రైలర్ అదిరిపోయింది. మరోసారి శంకర్ మార్క్ కనిపించింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ట్రైలర్ ను ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేశారు. అందరూ ఊహించినట్లుగా ట్రైలర్ అదిరిపోయింది. మరోసారి శంకర్ మార్క్ కనిపించింది.
తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. రెండు క్యారక్టర్లలో చాలా పరిణితి కలిగిన హావభావాలున్నాయంటున్నారు రామ్ చరణ్. తమన్ బీజీఎం వేరే లెవెల్ లో ఉన్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ లాంటి సినిమాను ప్రేక్షకులకు శంకర్ అందించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
చరణ్‌కు జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ్ డైరక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. సముద్రఖని , ఎస్ జే సూర్య, శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.