రాత్రి చెన్నై లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె కు ఇప్పుడు 87 ఏళ్లు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి చెన్నై లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె కు ఇప్పుడు 87 ఏళ్లు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'చెరపకురా చెడేవు' చిత్రం ద్వారా ఆమె తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. ప్రముఖ నటులు ఎంజీఆర్ , శివాజీ గణేషన్, జైశంకర్ ల సినిమాల్లో చాలా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ లాంటి మహా మహులతో నటించారు.
1963లో 'నానుమ్ ఒరు పెన్' చిత్రంలో ఏవీఎం రాజన్ సినిమాలో ఆమె నటించారు. ఆ సందర్భంగా ప్రేమలో పడిన వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కూతురు హీరోయిన్ గా రాణించింది.