ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. స్కూల్స్ లో ఫెసిలిటీస్ ను బట్టి ఫీజు పెంచుకోవచ్చు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజును సంవత్సరానికి ఒకసారి పెంచుకోవచ్చు, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా ఆ పెంపు శాతాన్ని నిర్ణయించాలి. అయితే ఫీజుల నియంత్రణకు నియమించే కమిషన్ మూడేళ్లకోసారి ఈ రుసుములను సమీక్షించి సవరిస్తుంది.' ఈ మేరకు తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. స్కూల్స్ లో ఫెసిలిటీస్ ను బట్టి ఫీజు పెంచుకోవచ్చు.
ప్రైవేటు పాఠశాలలను 5 కేటగిరీలుగా విభజించాలి. రాష్ట్రంలో ఇప్పుడు సుమారు 11,500 ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ లో ప్లే గ్రౌండ్ , ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్ డైనింగ్ హాళ్లు, క్రీడా స్థలం, ఇతర సౌకర్యాల ఆధారంగా కేటగిరీలను నిర్ధారించాలి. తరగతి గదిలో ఒక్కో విద్యార్థికి సగటున 25 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి.చివరిది అయిన 5వ కేటగిరికి చెందిన పాఠశాలలు రూ.32 వేల వరకు ఫీజు వసూలు చేసుకునే అవకాశం ఉంది. కాని స్కూల్ ఒక ఎకరా ప్లేసులో ఉండాలి.
2వ కేటగిరీ ఫీజు గరిష్ఠంగా రూ.2 లక్షలలోపు ఉండొచ్చు. మొదటి కేటగిరీ స్కూల్‌కు గరిష్ఠ రుసుం ఇంకా నిర్ణయించలేదు.
ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే విచారణ జరిపి మొదటిసారి రూ.లక్ష జరిమానా విధిస్తారు. ఈ ఫీజులు కాని పెంచితే లక్షల్లో ఫైన్ కట్టాల్సి ఉంటుంది. పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులను వెబ్‌సైట్లో ఉంచాలి. వాటి ఆడిట్ నివేదికలను సైతం పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి.