యదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో పదవ తరగతి విద్యార్థులు ఉదయాన్నే లేస్తున్నారా లేదా అని పరిశీలించిన జిల్లా కలెక్టర్, వారికి విద్యపై మక్కువ కల్పిస్తున్నారు.
న్యూస్ లైన్ , డెస్క్ : పదో తరగతి విద్యార్థుల్లో స్ఫూర్తినింపేలా, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టేలా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమతరావు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వినూత్నకార్యక్రమాలతో, వారికి మరింత దగ్గరవుతూ ఓ కొత్త బాట వేసే ప్రయత్నం చేస్తున్నారు. యదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో పదవ తరగతి విద్యార్థులు ఉదయాన్నే లేస్తున్నారా లేదా అని పరిశీలించిన జిల్లా కలెక్టర్, వారికి విద్యపై మక్కువ కల్పిస్తున్నారు. వారు ఏం చదువుతున్నారో తెలుసుకుని, ఈజీ స్కోరింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు టైమ్ టేబుల్ గురించి అడిగితెలుసుకుంటున్నారు. వారికి పలు సూచనలు చేస్తున్నారు. భరత్ చంద్రా చారి అనే విద్యార్థి ఇంటికి వెళ్లి.. కుటుంబ ఆర్థిక స్థితిగతులు, పదవ తరగతి పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు.
ఇక నారాయణపూర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత రావు బుధవారం రాత్రి బస చేశారు. చదువు ఎలా సాగుతుందని పిల్లలను కలెక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. అనంతరం విద్యార్థుల వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదవాలని సూచించారు.