ఒకవైపు లక్షలాది మంది పేద రైతులు రుణమాఫీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వంలోని పెద్దలకు రుణమాఫీ చేస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి తాండూరులోని డీసీసీబీ బ్యాంకులో ఉన్న రూ.1.50 లక్షల రుణాన్ని మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
న్యూస్ లైన్ డెస్క్ : రైతులందరికీ రుణమాఫీ చేశామని ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే.. మరోవైపు వేలాది మంది రైతులు రోడ్లెక్కి తమకు రుణమాఫీ కాలేదని ఆందోళనలు చేస్తున్నారు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆగష్టు 15 వరకల్లా అందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాం.. చెప్పినట్టుగా రుణమాఫీ చేశామని ప్రభుత్వం ఊదరగొడుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర నిజం బయటపడింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి రూ.1.50 లక్షల రుణమాపీ అయిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
ఒకవైపు లక్షలాది మంది పేద రైతులు రుణమాఫీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వంలోని పెద్దలకు రుణమాఫీ చేస్తోంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి తాండూరులోని డీసీసీబీ బ్యాంకులో ఉన్న రూ.1.50 లక్షల రుణాన్ని మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సైతం సోషల్ మీడియాలో షేరింగ్ అవుతోంది. పేదలకు రుణమాఫీ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు మాత్రం చాలా బాగా రుణమాపీ చేస్తోందని నెటిజనులు కాంగ్రెస్ సర్కార్ మీద మండిపడుతున్నారు.