Accidental PM: మన్మోహన్ సింగ్ పై సినిమా ఉందని చాలా మందికి తెలీదు !

మన్మోహన్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్ పోషించారు. సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు


Published Dec 27, 2024 02:52:00 PM
postImages/2024-12-27/1735291422_617b2d48ce314d14aa5dc07bc5b3cfbd.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: భారత ప్రధానిగా పదేళల పాటు సేవలందించిన మన్మోహన్ సింగ్ జీవితంపై ఓ సినిమా కూడా ఉంది. మన్మోహన్ సింగ్ ఫ్రెండ్ సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. సినిమా పేరు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పేరుతో నిర్మించారు. ఈ మూవీలో మన్మోహన్ పాత్రను బాలీవుడ్ హీరో అనుపమ్ ఖేర్ పోషించారు. సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. 2019లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ పరువు తీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించింది.


అంతేకాదు సినిమా రిలీజ్ ఆపడానికి చాలా ప్రయత్నాలు కూడా చేసింది.. లోక్ సభ ఎన్నికల ముంగిట ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఓటర్లపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆరోపించింది. వివాదాలు రేగినా ..ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసినా సినిమా విడుదల మాత్రం జనాల్లోకి వచ్చేసింది. 2019 జనవరి 11న ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలోని పలు డైలాగ్ లపై అప్పట్లో సర్వత్రా చర్చ జరిగింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ 5 లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu congress loksabha movie-news manmohan-singh

Related Articles