ఇవాళ కూడా గోల్డ్ రేటు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన టైంలో గోల్డ్ రేటు తగ్గడం కాస్త సంతోషమే అయినా పెద్దగా తగ్గకపోవడం బాధాకరం .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధర మాట్లాడాలంటేనే భయమేసే రేంజ్ లో పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాలన్నింటిలోను బంగారం ధర ఈ రోజు ఎలా ఉందంటే ..ఈ రోజు బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టాయి . 10గ్రాముల గోల్డ్ పై బుధవారం భారీగా తగ్గుదల చోటు చేసుకోగా.. ఇవాళ కూడా గోల్డ్ రేటు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన టైంలో గోల్డ్ రేటు తగ్గడం కాస్త సంతోషమే అయినా పెద్దగా తగ్గకపోవడం బాధాకరం .
10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.110 తగ్గింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.100 తగ్గుదల చోటు చేసుకుంది. అంటే తులం మీద 1100 తగ్గినట్టు. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర 90,050 కాగా 24 క్యారట్ల బంగారం ధర రూ. 98,240 కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.98,340కు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 90,050 కాగా.. 24క్యారెట్ల ధర రూ.98,240 కు చేరుకుంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.1,10,900 గా నడుస్తుంది.