న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఉద్యోగం అంటే గగనం అన్నట్లు అయ్యింది. అందులోను డిగ్రీ క్వాలిఫికేషన్ తో అయితే ఇంకా కష్టం. చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఓవర్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు.ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్, కొత్త ట్రెండ్స్, టెక్నాలజీల గురించి తెలుసుకుని ఉండాలి. అలాంటి వారికే ఉద్యోగాలు వస్తున్నాయి. అదే ప్రభుత్వ ఉద్యోగానికి అయితే ...చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్క ఉద్యోగానికి వంద మంది.. పోటీ ఉన్నా కష్టపడుతున్నారు. అయితే సొంత రాష్ట్రంలోనే జాబ్ దొరికితే ఎక్కువ సంతోషిస్తారు.
టీటీడీ లో చాలా ఉద్యోగాలకు ..టీటీడీ నోటిఫికేషన్ ఇచ్చింది. బోర్డుకు చెందిన ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా సేవలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్హత గల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక మొత్తం 5 అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండగా.. వీటిల్లో బీసీ బీ (మ) -01, ఎస్టీ(మ)– 01, బీసీ బీ -01, ఎస్‌సీ -01, బీసీ డీ(మ)- 01 కేటగిరీల వారీగా ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఆగష్టు 29 ఇంటర్వ్యూ ప్రాతిపదికన రిజల్ట్ ఇస్తారు..
ఈ పోస్టుల భర్తీ కోసం తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ ఆస్పత్రిలో ఈ ఇంటర్వ్యూని నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూకి మీ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీలు, మీ కాస్ట్ సర్టిఫికేట్ తో పాటు , ఆధార్ కార్డు కూడా తీసుకురావాల్సి ఉంటుంది.