న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం ..దేవదేవుని నిలయమే కాదు ..దళారుల అడ్డా కూడా..తెలియదని దళారులను పట్టుకున్నామా..వేలకు వేలు దోచేస్తారు. అందుకే టీటీడీ ఓ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శన టికెట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దని తెలిపింది.
14449 శ్రీవాణి దర్శన టికెట్లను 545 యూజర్లు ద్వారా పొందినట్లు గుర్తించిన టీటీడీ.. ఓకే యూజర్ ఐడీ నుంచి 225 శ్రీవాణి దర్శన టికెట్లు పొందినట్టు గుర్తింపు.. బల్క్ బుకింగ్ చేస్తున్న యూజర్ ఐడీలను బ్లాక్ చేస్తున్న టీటీడీ.. దళారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో టీటీడీ.
ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. లడ్డు ప్రసాద క్వాలిటీ పెంచారు. అన్నదాన సత్రాలు, టికెట్లు , నడిచివచ్చే వారి కోసం చేయాల్సిన ఏర్పాట్లు కరెక్ట్ జరిగేలా చూస్తున్నారు. ఇంతకు ముందు నడకదారిలో వచ్చే వారి కోసం ..ఎలాంటి జంతువులు రాకుండా పెద్ద పెద్ద స్పీకర్లతో గోవింద నామాలు ఉండేవి...గత ప్రభుత్వంలో వాటిని తొలగించారు. ఈ శబ్ధాలు లేకపోవడం వల్లే చిరుత దాడులు ఎక్కువైయ్యాయనేది అధికారుల అంచనా..తిరిగి అవన్నీ ఏర్పాట్లు చేయిస్తున్నారు టీటీడీ అధికారులు.