ఈ పవిత్రమైన రోజున విష్ణువు వామనావతారాన్ని ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు ఈ రోజు అత్యంత పవిత్రమైనది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సనాతన ధర్మంలో ప్రతి మాసంలో వచ్చే ఏకాదశికి ఓ ప్రత్యేకమైన విశేషత ఉంటుంది. ఈ నెల ఏకాదశిని "వరూథిని ఏకాదశి". ఇది ఏటా చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు వస్తుంది. అయితే, ఈ సంవత్సరం ఏప్రిల్ 24న గురువారం "వరూథిని ఏకాదశి" వచ్చింది. మహావిష్ణువు వామనావతారం ఎత్తిన రోజు కావడంతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువు వామనావతారాన్ని ఆరాధిస్తారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు ఈ రోజు అత్యంత పవిత్రమైనది.
వరూధూని ఏకాదశి ఒక్కటి ఆచరిస్తే ..అదృష్టం బాగా కలిసిరావడంతోపాటు అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు సిద్ధింపచేసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా వరూథిని ఏకాదశి రోజుఎవరైనా సరే "ఏకాదశి వ్రతం" చేస్తే 10వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది.
* ఏకాదశి వ్రతం అంటే ఏమిటంటే, రోజు వారీ పూజలతోపాటు రోజంతా ఆహారం తీసుకోకుండా పాలు, పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి.
* పగలు పాలు, పండ్లు స్వీకరిస్తూ రాత్రి పూట గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు. దీన్ని హరినక్తం అంటారు.
* వరూథిని ఏకాదశి రోజు ఎవరైనా సరే కొన్ని ప్రత్యేక దానాలు చేస్తే సూర్యగ్రహణం సమయంలో బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుందంటున్నారు.
* "నీటి కుండ దానం" ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు. అంటే, ఒక కుండ నిండా నీటిని నింపి దానం చేస్తే చాలా మంచిది.
* ధాన్యం దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయంటున్నారు.
* ఒకవేళ ఉపవాసం ఉండడం కుదరని పక్షంలో నీటి కుండను దానం చేసినా అదే ఫలితం దక్కుతుందంటున్నారు .
* సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పవిత్ర నది స్నానం చేయాలి. నది స్నానం కుదరని వాళ్లు ఇంట్లోనే పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు.
వరూథిని ఏకాదశి రోజున పూజించాల్సిన దైవం వామనుడు. అంటే, వామన రూపంలోని శ్రీ మహా విష్ణవును ప్రార్థించాలి.