గత నెలలో జరిగిన డ్రోన్ల అమ్మకాలను సంబంధించిన రికార్డులు , కొనగోలుదారులు వివరాలు -కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఉండవచ్చని, అవి దర్యాప్తులో కీలక ఆధారాలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ - పాకిస్థాన్ మధ్య కొన్ని రోజుల పాటు కొనసాగిన సైనిక దాడుల అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ , సరిహద్దు వెంబడి తర్వాత కలకలం రేగింది. రీసెంట్ నియంత్రణ రేఖ దగ్గర్లో కొన్ని అతి తక్కువ దూరం ప్రయాణించగల చిన్న డ్రోన్లు భద్రతా దళాలకు లభ్యమయ్యాయి. గత నెలలో జరిగిన డ్రోన్ల అమ్మకాలను సంబంధించిన రికార్డులు , కొనగోలుదారులు వివరాలు -కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద ఉండవచ్చని, అవి దర్యాప్తులో కీలక ఆధారాలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ భారీ డ్రోన్లు వైమానిక దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ తన సైనిక దాడి సమయంలో 800నుంచి 1000 డ్రోన్లను మోహరించిందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనర్ సుమేర్ డి' కున్హా ధ్రువీకరించారు. వీటిని భారత వైమానిక దళ సిబ్బంది , రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయని ఆయన తెలిపారు. ఇవి పది కిలోలకు పైగా పేలోడ్లను మోసుకెళ్లగలవని పేర్కొన్నారు. భారత భూభాగంలో వందలాది డ్రోన్ శకలాలు దొరికాయని, ఇది దాడి తీవ్రతను, భారత దళాల వేగవంతమైన, సమర్థవంతమైన ప్రతిఘటనను తెలియజేస్తోందని అధికారులు పేర్కొన్నారు.