gamechanger: గేమ్ ఛేంజర్ ...నిజంగానే శంకర్ గేమ్ ఛేంజర్ గురూ!

కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ శ్రీమతి అనిత సమర్పణలో , దిల్ రాజు, శిరీష్ కలిసి  ప్రొడక్షన్ లో రిలీజ్ చేశారు.


Published Jan 10, 2025 07:44:00 AM
postImages/2025-01-10/1736475303_gamechangerreview011736447481.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  శంకర్ సినిమా ...ఆ ఏం చూస్తాం లే..నాకు నమ్మకం లేదు. ఫ్లాప్ పక్కా ప్లాప్ ..ఇండియా 2 చూసిన వారంతా అన్న మాట ఇదే . శంకర్ సీన్ అయిపోయింది. అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీస్ తీసుకొస్తున్నారు.  గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అంటూ తెగ ఊదరగొట్టేశారు. కాని శంకర్ ఎప్పుడు గేమ్ ఛేంజర్ మీ అంచానాలకు ఆయన ఎప్పుడు అందడు. భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్్ ను రిలీజ్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ శ్రీమతి అనిత సమర్పణలో , దిల్ రాజు, శిరీష్ కలిసి  ప్రొడక్షన్ లో రిలీజ్ చేశారు.


బొమ్మ హిట్టు ...రివ్యూ లు ఇవ్వడం అనేది మనం తినని భోజనానికి టేస్ట్ చెప్పినట్లు ఉంటుంది. కాని సినిమా ఎలా మాట్లాడుకుందాం. కియారా యాక్టింగ్ ...రామ్ చరణ్ ఎలివేషన్స్ ...ఎస్ జే సూర్య యాక్టింగ్ , బీజీఎం , ఆడియన్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత శంకర్ గ్రేట్ కమ్ బ్యాక్. స్టోరీ టెల్లింగ్, స్టెల్లర్ ఫెర్ఫార్మెన్స్, టాప్ ఫెర్ఫార్మెన్స్, అద్బుతమైన సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్‌ మూవీకి అదనపు ఆకర్షణ. 


పర్ఫెక్ట్ గా మాట్లాడుకోవాలంటే ...రాంచరణ్ లవ్ స్టోరీ బోరింగ్‌గా ఉంది. కామెడీ అంత బాగాలేదు. కాని సంక్రాంతి సందడిలో భారీ కలక్షన్లు వచ్చే సినిమా. ఇంకా డీటైల్ మాట్లాడుకుంటే కార్తీక్ సుబ్బరాజ్ కథ అంత గొప్పగా ఏం లేదు. కాని శంకర్ సినిమాను ఇంట్రస్టింగ్ గా మార్చేశారు. బోర్ అనుకుంటున్నపుడు చిన్న పంచ్ పడుతుంది. అది ఆడియన్స్ కు మజా వచ్చే కిక్కు. థమన్ మ్యూజిక్ అలా మ్యాజిక్ లా వెళ్లిపోయినా ..సెకండ్ టైం మళ్లీ వినాలంటే కాస్త అవసరానికి మించి ఉన్నట్లు ఉంటుంది.


 ఇండియన్ 2 సినిమాతో డిజాస్టర్ అందుకొన్న శంకర్.. గేమ్ ఛేంజర్ సినిమాను కసితో తీశాడు. సినిమా సెకండాఫ్ మాత్రం నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంది . అంజలిని ఇంతకు ముందు ఎవ్వరు ఇలా చూపించలేదు. అంజలి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా తో రామ్ చరణ్  నేషనల్ అవార్డు రావడం పక్కా అనేంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సూపర్ డూపర్ హిట్ట్. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shankar-director game-changer

Related Articles